|
ఎప్పుడో పెళ్లి కొడుకు అవుతాడనుకున్న ఉదయ్‌కిరణ్ స్టిల్ బ్యాచ్‌లర్‌గా వున్నాడు. కూలుపోయిన కెరీర్‌కు మరమ్మతులు చేసుకునే పనిలో వున్న అతను పెళి ఆలోచనను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టే వున్నాడు. అయితే అతనింట్లో ఇటీవల మరో పెళ్లి జరిగిందట. అది అతని తండ్రిగారికి! ఉదయ్ తల్లి కొంత కాలం క్రితం మరణించారు. ఆమె మరణించిన తర్వాత ఉదయ్ తండ్రి మళ్లీ పెళ్లికి సిద్దపడ్డారట. ఉదయ్‌కిరణ్ సమ్మతంతోనే ఈ పెళ్లి జరిగిందని ఫిలింనగర్ కబురు. ఇది చాలా సహజమైన విషయమే అయినా హీరో ఇంట్లో ఎవరికి పెళ్లి జరిగినా దానికి పబ్లిసిటీ వుంటుంది కదా జనరల్‌గా. ఉదయ్‌కిరణ్ పెళ్లి వార్త ఎప్పుడు వింటామో మరి? |