|
|
|
మెగాస్టార్ చిరంజీవి గొప్పతనాన్ని, ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాల గురించి పాటల రూపం లో పొందుపరచిన ఆల్బమ్ ను గుడివాడకు చెందిన చిరంజీవి అభిమానులు మగాస్టార్ అభిమానులకు కానుకగా అందివ్వనున్నారు. ఈ ఆల్బమ్ పేరు ' చిరువెలుగు ' గా రూపొందించారు. హైదరాబాద్ లోని మెలోడి డిజిటల్ స్టూడియోలో దర్శకత్వ శాఖ లో సుధీర్ఘ అనుభవాన్ని గడించిన శ్రీనివాసమూర్తి ఆధ్యర్యం లో ఆడియో రికార్డింగ్ పూర్తి అయ్యింది. అయిదు పాటలు, ఓ శ్లోకం, ఓ ఫాస్ట్ బీట్ సాంగ్ తో ఈ అల్బమ్ ను రూపొందించారు. మెగాస్టార్ కు పాటలు వినిపించి ఆయన అనుమతితో ఆడియోను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఆల్బమ్ విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.
|
|