పూర్తిసమయం చిత్రపరిశ్రమకే : గణేష్
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

 చలన చిత్ర సీమలో నటుడిగా ఉన్న గుర్తింపు ఎప్పటికీ మరులేనిదని నటుడు గణేష్ వెల్లడించాడు. వినోదం చిత్రంతో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన గణేష్‌కు నేటితో తన కెరీర్‌కు పది సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా విలేకరలుతో గణేష్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో వ్యాపార పరంగా తను చాలా బిజీ అయిపోయినట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూ అదేమీ లేదని ఎప్పటిలానే తనకు తగిన పాత్రలనిచ్చి దర్శక నిర్మాతలు ప్రోత్సహించాలని కోరాడు.తను ఇప్పటి వరకు మంచి హిట్‌ను అందుకోలేక పోయానని చెప్పాడు. కాస్త నిరాశగా ఉన్నా పూర్తి సమయాన్ని చలన చిత్ర సీమకే తన కాలాన్ని కేటాయించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. రెండు సంవత్సరాల క్రితం పౌల్ట్రీ బిజినెస్‌లో కాస్త బిజీగా ఉన్న మాట వాస్తవమే అయినా ప్రస్తుతం దానిని తన సహోదరునికి అప్పగించినట్లు చెప్పాడు. కనుక ప్రస్తుతం తాను చిత్రాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. ఏ పాత్రలోనైనా నటిస్తానని చెప్పే గణేష్ హీరోగా చేదు అనుభవాన్ని మూటగట్టుకున్న తాను మళ్లీ దానిని పునరావృతం కానీయనని తెలిపాడు. తాను ఇటీవలే పోకిరి, చిరుత చిత్రంలో నటంచానని చెప్పిన గణేష్ ప్రస్తుతం రాజశేఖర్ హీరోగా నటిస్తున్న గోరింటాకు చిత్రంలో తనో పాత్రధారుడిగా ఉన్నట్లు చెప్పాడు. సో మిస్టర్ గణేష్...! ఆల్ ద బెస్ట్ ఫర్ గెట్టింగ్ ఏ గుడ్ Break....

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.