|
|
"కాల్ సెంటర్ లో పనిచేసే సత్యరాజ్ ఓరోజు ఉదయమే ఇంటికి వెళుతూ లోకల్ ట్రైన్‌లో మర్డర్ జరగదం చూస్తాడు. ఆ హత్యకు అతను ప్రత్యక్షసాక్షి, హంతకుల్ని పట్టుకోవదం కోసం సత్యరాజ్ పోలీసులకు కూడా తన సహకారాన్ని అందిస్తాడు. అయినా వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఈ సీరియల్ మర్డర్స్‌కు కారణం ఏమిటి? అసలెందుకు ఇలా జరుగుతోంది? అనే అంశాలను చాలా అసక్తికరంగా దర్శకులు సెంధిల్ కుమార్ తెరకెక్కించారు" అని చెప్పారు '6.2 ఓ అపరిచితుడు' చిత్ర నిర్మాతలు కిషన్ నాయక్, శ్రీరామ్‌రెడ్డి. మా పసలపూడి చిత్రాలు పతాకంపై ఈ సినిమాను వారు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సత్యరాజ్‌కు జోడీగా ఈచిత్రం లో తెలుగు అమ్మాయి సునీతవర్మ నటించిదని, ఆమె నటన చిత్రానికి హైలైట్‌గా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. ఈ మర్డర్ మిస్టరీకి డి.ఇమాన్ చక్కని నేపథ్య సంగీతాన్ని అందించారని, సెన్సార్ పూర్తయిన ఈ చిత్రాన్ని నవంబర్ మూడోవారంలoోవిడుదల చేయబోతున్నామని వారు అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: కెమ్వెంకట కృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గణేష్ వరసిద్ధి.
|
|