|
|
|
పెళ్ళయిన తరువాత జీవితంలోకి బాయ్ ఫ్రెండ్ ప్రవేశిస్తే?ఆ భార్య ఏలా ప్రవర్తించిందో,బాయ్ ఫ్రెండ్ తో కలిసి భర్తను మోసం చేస్తే,భర్త ఆ భార్యను ఏం చేస్తాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే "మొగుడు పెళ్ళాం ఓ బాయ్ ఫ్రెండ్" అని నిర్మాతలు వల్లభనేని వెంకటేశ్వరరావు, గుత్తికొండ మురళీమోహన్ చెబుతున్నారు. కన్నడలో విజయవంతమైన ఓ చిత్రాన్ని తెలుగులోకి దివ్యసాయి పిక్చర్స్ పతాకంపై అందిస్తున్నారు. రవి శ్రీ వాస్తవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. భర్తగా విశాల్, భార్యగా సంజన, బాయ్ ఫ్రెండ్ గా తిలక్ నటించారు. సోమవారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వల్లభనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ,ఇప్పటికే ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందన్నారు. నవంబర్ రెండో వారంలో సినిమా విడుదలకు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. బ్యాంకాక్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన లొకేషన్ల నడుమ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శృంగారం, సెంటిమెంట్ కలిసిన కుటుంబకథా చిత్రమిదని వల్లభనేని తెలిపారు.
|
|