|
|
|
ఇప్పటి వరకు కుటుంబ కథాల చిత్రాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చే విక్టరీ వెంకటేష్ తాజాగా పురాణ, చారిత్రాత్మక కథా చిత్రాలపై మక్కువ చూపుతున్నారు. 'స్వామి వివేకానంద' చిత్రంలో నటించనున్నట్టు గతంలో పలు ఊహాగానాలు వచ్చిన విషయం తెల్సిందే. అయితే.. ప్రస్తుతం ఈ ఊహాగానాలు నిజం అయ్యే అవకాశాలు కనిపిస్తునాయి. వెంకటేష్ తదుపరి చిత్రంగా 'స్వామి వివేకానంద' చిత్రాన్ని చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రానికి భక్తిరస చిత్రాను వెండి తెరకెక్కించడంలో చేయి తిరిగిన దర్శకునిగా పేరుగాంచిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించే సూచనలు కన్పిపిస్తున్నాయి. ప్రసుత్తం యువరత్న బాలకృష్ణతో 'రంగా.. పాండురంగా' చిత్రాన్ని దర్శకుడు రాఘవేంద్ర రావు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్ అనంతరం 'స్వామి వివేకానంద' చిత్రంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.
|
|