|
|
|
తమిళంలో రజనీకాంత్ సరసన శివాజీ సినిమాలో నటించిన తరువాత శ్రియాకు అవకాశాలు విపరీతంగా వస్తున్నాయి. ఆమె ఇప్పటికే విజయ్, విక్రమ్ సరసన నటించింది కూడా. హాలీవుడ్ అవకాశం కూడా దక్కించుకుంది. ఇలా అవకాశాలు వెల్లువెత్తుతున్నా కమెడియన్ వడివేలుతో ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకుంది. ఆ ఐటమ్ సాంగ్ కు ఎలా ఒప్పుకుందా అని అందరి డౌట్. బయటివారు ఎవరడిగినా చెప్పలేదు కానీ దగ్గరి స్నేహితులు అదే అడుగుతుండడంతో షాకయిన శ్రియా అసలు విషయాన్ని చెప్పేసింది. ఆమె మాటల్లోనే...వడివేలును ఫిజికల్ గా తాకే అవకాశం లేదు. కథ ప్రకారం వడివేలుకు ఏదో జబ్బు అంటుకుంటుంది. అది బాగుచేయడానికి స్వర్గం నుంచి శ్రియా దేవతలా వచ్చి వడివేలు కోసం పాట పాడుతుంది. అంటే అప్సరస అన్నమాట. అంతేకానీ వడివేలుకు జోడిగా ఏం చేయడంలేదు...అంది శ్రియా. ఇంకోవిషయం ఏమంటే వడివేలు నటన అంటే శ్రియాకు చాలా ఇష్టమట. వడివేలు తెరమీద కనిపిస్తే చాలు పడీపడీ నవ్వుతుందట. వడివేలు బాడీ లాంగ్వేజే ఇందుకు కారణమట. అదీ సంగతి.
|
|