|
|
|
'జయం' చిత్ర కాంబినేషన్ మరో చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. యువ కథానాయకుడు నితిన్, సదా నటించిన 'జయం' చిత్రం ఇంతకు ముందు సూపర్ డూపర్ హిట్ ను సాధించిన విషయం తెల్సింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో 'టక్కరి' చిత్రం రూపుదిద్దుకుటోంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై పరచూరి శివరామ్ ప్రసాద్ నిర్మిస్తున్న 'టక్కరి' చిత్రాన్ని దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి 'అమ్మ' రాజశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా, చక్రీ సంగీతం సమకూర్చారు.
|
|