ఇలియానాకి స్వాతి డబ్బింగ్ చేబుతుంది
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం
పవన్ కళ్యాణ్,ఇలియానా హీరోహీరోయిన్లుగా చేస్తున్న జల్సా సినిమా ఇప్పటికే 70శాతం పూర్తి కావచ్చింది. ఇందులో ఇలియానాకు గొంతు అరువిచ్చేందుకు మా టీవీ కలర్స్ స్వాతి సిద్ధమవుతోంది. స్వాతికి డేంజర్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలకు పనిచేసిన అనుభవం కూడా ఉంది. స్వాతికి సినిమాలలో అవకాశాలు మాత్రం రావడంలేదు. సరే ఇలియానాకు డబ్బింగ్ చెప్పడం కోసం అడగగానే సంతోషంగా ఒప్పుకుందట. బెస్ట్ ఆఫ్ లక్ స్వాతి.