|
|
|
భిన్న చిత్రాల కథానాయకుడుగా వైవిధ్యమైన నటనను కనబరుస్తూ తెలుగు చలన చిత్ర సీమలో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న జగపతి బాబు ప్రస్తుతం తన 75వ చిత్రం స్వాగతంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి కథా పరంగా ఈ మధ్యే న్యూజెర్సీ వెళ్లొచ్చాడు. జగపతి సరసన అనుష్క, భూమికలు నటిస్తున్న ఈ చిత్రం దశరథ్ దర్శకత్వ సారథ్యాన రూపొందుతోంది. ఆదిత్యారాం నిర్మాణ సారథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంగీతం ఆర్‌పీ పట్నాయక్ అందిస్తున్నారు. ఇటీవలే విదేశాలకు వెళ్లి వచ్చిన సందర్భంగా ఆదిత్యారాం మాట్లాడుతూ న్యూజెర్సీలో వేటూరి రాసిన పాటకు సంబంధించి కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు.
ఈ చిత్రానికి ఆర్‌పీ పట్నాయక్ అందించిన సంగీతం చాలా చక్కగా ఉందని, ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే గోపీ మోహన్ ఇస్తుండగా, కెమెరా రమేష్ బాబు షూట్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ కొ ఆర్డినేటర్‌గా భగీరథ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జగపతి బాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు చిత్రాల సక్సెస్ వేరు ఈ చిత్రానికి వచ్చే విజయం వేరని ఆయన తెలిపారు. స్వాగతం చిత్రం 75వ చిత్రం గనుక దీనిపై మరింత శ్రద్ధ వహిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రం విజయానికి తాను శ్రమిస్తానని వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ నవంబర్‌లో ప్రారంభమై అదే నెలలో ముగుస్తుందని చెప్పారు.
|
|