వినోదంతో సందేశం
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

 నితిన్‌, మమతా మోహన్‌దాస్‌ జంటగా ఆర్‌. ఆర్‌. మూవీ మేకర్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. రవి సి.కుమార్‌ దర్శకుడు. వెంకట్‌ నిర్మాత. ప్రస్తుతం ఘాటింగ్‌ జరుగుతోంది. చిత్ర సమర్పకుడు కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ "ఈ నెల 21 వరకు ఈ షెడ్యూల్‌ ఉంటుంది. హైదరాబాద్‌లోని అందమైన లొకేషనల్లలో చిత్రిస్తాం. ఇందులో కీలక సన్నివేశాలను, ఓ పాటను తెరకెక్కిస్తాం. ఈ చిత్రం నితిన్‌కు మంచి ములుపునిస్తుంద"ని పేర్కొన్నారు. దర్శకుడు చిత్రం గురించి చెబుతూ "సామాన్యూ తర్వాత ఈ బ్యానర్ లో నేను చేస్తున్న చిత్రమిది. మంచి కథాంశంతో రూపోందిస్తున్నాం. అలరించే వినోదంతో పాటు మెప్పించే సందేసాన్ని కూడా జోడిస్తున్నామ"ని వివరించారు. సింధు తులాని, శశాంక్‌, ఆశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‌

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.