|
మహేష్ బాబు తన తదుపరి చిత్రం ఏ దర్శకుడితో చేస్తారనే సంశయం ఆయన ప్రకటనలతో కలుగుతుంది. ఇప్పటికే యుటివితో మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్న మహేష్ బాబు అందులో ఒక సినిమాను శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తానని ఆయన అన్నారు కూడా. ఇపుడు తన అతడు సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హరేరామ హరేకృష్ణ సినిమా చేయాలనుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం.
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న జల్సా సినిమా పూర్తవగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ సినిమాకు పనిచేయనున్నట్టు భొగట్టా. ఇందుకు సంబంధించి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చర్చించినట్టు కూడా తెలుస్తోంది. మరి మిర్చి సినిమా ముందా లేక హరేరామ ముందా అన్నది సస్పెన్స్ కాగా శేఖర్ కమ్ములతో సినిమా ఎపుడు అన్నది మరో విషయం.
|