అందాల సుందరికి 34 ఏళ్లు
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

  అందాల సుందరి ఐశ్వర్యరాయ్‌ గురువారం 34 ఏళ్లు పూర్తి చేసుకొని 35వ వడిలోకి అడుగుపెట్టింది. పెళ్లైన తరవాత ఆమెకిదే తొలి పుట్టిన రోజు. అత్తమామలు, భర్త సమక్షంలో..ఆగ్రాలో.. పేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌ దగ్గర ఆమె ఈ జన్మదినం జరుపుకోవడం విశేషం. మరో చెప్పుకోదగ్గ అంశమేంటంటే...ఆమె తాజాగా 'తాజామహల్‌' అనే హాలీవుడ్‌ చిత్రంలో ముంతాజ్‌ బేగమ్‌ పాత్రలో నటించనుంది. బెన్‌కింగ్స్‌లే దర్శకుడు. ప్రస్తుతం ఐశ్వర్య 'పింక్‌ పాంథర్‌' అనే ఇంగ్లిష్‌ చిత్ర ఘాటింగ్‌తో కొన్ని రోజులుగా విదేశాల్లో బిజీగా గడిపింది. ఇక్కడికి తిరిగి రాగానే అశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'జోధా-అక్బర్‌' ఘాటింగ్‌లో రెండు రోజుల పాటు పాల్గొంది. ఇది పూర్తి కాగానే భర్త అభిషేక్‌ దగ్గరలి వాలిపోయింది. పవిత్ర ప్రేమకు సాక్షిగా నిలిచిన తాజ్ మహల్ కొలువున్న ఆగ్రా పట్టణానికి బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, ఆయన భార్య మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్‌లు మంగళవారం చేరుకున్నారు. వారితో పాటు అభిషేక్ మాతృమూర్తి జయాబచ్చన్, సమాజ్‌వాది పార్టీ నేత అమర్ సింగ్‌లు ఆగ్రాకు వచ్చారు. ఈ సందర్భంగా తాజ్ మహల్ చెంత ప్రముఖ మొబైల్ కంపెనీకి చెందిన వాణిజ్య ప్రకటన చిత్రీకరణలో అభిషేక్ బచ్చన్ పాల్గొన్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో ఫతేపూర్ సిక్రీలోని సలీం చిస్టీ దర్గాలో ఐశ్వర్య రాయ్‌, జయాబచ్చన్ మరియు అమర్ సింగ్‌‌లు 'చదర్‌'లు నివేదించి ప్రత్యేక ప్రార్ధనలు జరిపారు. జన్మదిన కానుకగా మీరు ఏం బహుమానం కోరుకొంటున్నారని అడిగితే ప్రస్తుతం అందరి ఆశీస్సులు లభిస్తేచాలు...భగవంతుడి దయవల్ల అన్నీ సమకూరాయని చెప్పింది.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.