|
|
 |
జగపతిబాబు, భూమిక, అనుష్క హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న "స్వాగతం" సినిమా పాటల చిత్రీకరణను అమెరికాలోని న్యూజెర్సీలో జరుపుకుంది. ఆదిత్యారాం నిర్మిస్తోన్న ఈ చిత్రం ఈ నెల 6 నుంచి 20వ తేదీ దాకా న్యూయార్క్‌లోని న్యూజెర్సీలో షూటింగ్ ముగించుకుని చిత్ర యూనిట్ ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ... నవంబరు 5 నుంచి 25 దాకా హైదరాబాదులో ఈ స్వాగతం సినిమా చివరి షెడ్యూల్స్ జరుపుతామని, దీంతో చిత్రం షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలిపారు. కులశేఖర్ రాసిన ఒక పాటను, వేటూరి రాసిన మరో పాటను, ఇంకా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించామని, కథాపరంగా అమెరికాలోనే చిత్రీకరించాల్సి ఉంది కాబట్టే అక్కడే కొన్నింటిని చిత్రీకరించామని ఆయన అన్నారు. ఈ సినిమా జగపతిబాబుకు 75వ చిత్రమని, ఆయనకి మంచి పేరును తీసుకొస్తుందని చిత్ర నిర్మాత ఆదిత్యారాం చెప్పారు. ఆర్.పి. పట్నాయక్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ భగీరథ కాగా, స్క్రీన్ ప్లే గోపీమోహన్ అందించగా, కెమెరా సహకారాన్ని రమేశ్ బాబు అందిస్తున్నారు.
|
|