విక్రమ్‌ భీమ ఆడియో విడుదల
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

  ఎఎం రత్నం నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న భీమ చిత్రంలో విక్రమ్ హీరోగా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. విక్రమ్ సరసన హీరోయిన్‌గా త్రిష నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి మల్టీప్లెక్స్ థియేటర్‌లోని స్క్రీన్-2 లో జరిగిన కార్యక్రమంలో ఆడియోను ఆర్భాటంగా విడుదల చేయగా, పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తమిళ భాషలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులోను తెరకెక్కించడం విశేషమని యూనిట్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హీరో విక్రమ్ మాట్లాడుతూ ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా శారీరక ధృడత్వాన్ని పెంచుకున్నట్లు చెప్పారు. ఇందులో పాటలన్నీ మెలోడీ పరంగానే ఉంటాయని తెలిపారు.ఎఎం రత్నం మాట్లాడుతూ భారతీయుడు లాంటి హిట్ చిత్రాలను మార్కెట్ చేస్తున్న ఆదిత్య మ్యూజిక్ సంస్థ ద్వారా ఈ చిత్రం ఆడియో విడుదల చేస్తున్నాము. కాబట్టి ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ తమిళంలో ఈ పాటలు ఇప్పటికే విజయవంతమయ్యాయని, తెలుగులోను విజయాన్ని సాధిస్తాయన్నారు. తెలుగులో ఈ చిత్రం హక్కుల్ని పొందిన నూకారపు సూర్యప్రకాష్‌రావు మాట్లాడుతూ భీమగా విక్రమ్ అద్భుతమైన నటనను కనబరుస్తున్నట్లు చెప్పారు. కమల్‌హాసన్ వంటి వైవిధ్య నటనను విక్రమ్ ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి షరీన్, అర్జునరావు, తమ్మారెడ్డి భరద్వాజ్ విచ్చేశారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.