|
|
 |
ముమైత్‌ఖాన్ కథానాయికగా నటిస్తోన్న "మైసమ్మ ఐ.పి.ఎస్." సినిమా ఆడియోను నవంబరు 4వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకుడు భరత్ పారేపల్లి తెలియజేశారు. కథ, స్క్రీన్ ప్లేలను దాసరి నారాయణరావు సమర్పిస్తుండగా, దాసరి పద్మ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. చిత్ర నిర్మాత కె.రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ... ప్రస్తుతం సినిమా రీరికార్డింగ్ జరుగుతోందని, ఇప్పటికే 2 లక్షల దాకా ఆడియో ఆర్డర్లు వచ్చాయనీ మొదటి విడతగా నవంబరు 4వ తేదీన ఆడియోను విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సినిమాకి కెమెరాను సురేంద్రరెడ్డి అందించగా, సంగీతాన్ని ఎం.ఎం. శ్రీలేఖ సమకూరుస్తున్నారు.
|
|