|
|
 |
రిషి, నిఖిత, అనూమెహతా హీరో హీరోయిన్లుగా సాయికృప ప్రొడక్షన్స్ పతాకంపై వస్తోన్న "మహారాజశ్రీ" సినిమా ప్రస్తుతం రీరికార్డింగ్‌ను జరుపుకుంటోంది. నటి రాశి సమర్పణలో వస్తోన్న ఈ చిత్రానికి ఆమె భర్త ఎస్ఎస్ నివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను చేపట్టింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఈ సినిమా విశేషాల గురించి మాట్లాడుతూ.... కథను నమ్మే ఈ సినిమాని చేస్తున్నాననీ, మొదటి భాగమంతా ప్రేమకథా చిత్రంగా, రెండోభాగం యాక్షన్ నేపథ్యంతో ఉంటుందనీ, ప్రేక్షకులు ఊహించని విధంగా అనేక ట్విస్ట్‌లతో థ్రిల్లింగ్‌గా ఉంటుందని అన్నారు. భారీ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్ చేస్తోన్న పాత్ర హైలెట్‌గా నిలుస్తుందనీ, మరో ముఖ్య కథాపాత్రని షఫీ పోషిస్తున్నాడని నిర్మాత చెప్పారు. వినోద్‌కుమార్ సిన్సియర్ పోలీసు అధికారిగా నటిస్తోన్న ఈ చిత్రంలో ఇంకా వేణుమాధవ్, అభినయశ్రీలపై చిత్రీకరించిన పేరడీ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్మాత తెలిపారు. సుప్రీం ఆడియో ద్వారా నవంబర్‌లో ఆడియోను, నెలాఖర్లో సినిమాని విడుదల చేయనున్నామని ఆయన వివరాలందించారు.
|
|