|
|
 |
తమిళంలో వేల్‌గా రూపొందుతోన్న చిత్రాన్ని తెలుగులో దేవా చిత్రంగా రూపొందిస్తున్నారు. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సూర్య, ఆసిన్ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్నారు. శాఖమూరి పాండురంగారావు, కేవీవీ సత్యనారాయణ సంయుక్త నిర్మాణ సారథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని నవంబర్ 1న ఈ చిత్రానికి సంబంధించి ఆడియోను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నట్లు వారు చెప్పారు. ఈ చిత్రంలో విశేషం హీరో సూర్య ద్విపాత్రలలో కనిపించడమేనని చెప్పారు. అన్ని కార్యక్రమాలు త్వరలో పూర్తవుతాయని, దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. కళాభవన్ మణి, లక్ష్మీ, శరణ్య, నాజర్, వడివేలు తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే పాటలు చంద్రబోస్, వెన్నెలకంటి, వేటూరి, భువనచంద్ర, వనమాలి తదితరులు అందిస్తుండగా, మాటలు శశాంక్ వెన్నెలకంటి అందిస్తున్నారు. ఈ చిత్ర సమర్పణ బెల్లంకొండ సురేష్ చేస్తున్నారు.
|
|