శ్రీకాంత్‌,ఛార్మి జంటగా కొత్త చిత్రం ప్రారంభం
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

 శ్రీకాంత్, ఛార్మి హీరోహీరోయిన్లుగా సిల్వర్ స్క్రీన్ మూవీస్ పతాకంపై ఓ చిత్రం ప్రారంభమైంది. రాజు, ప్రవీణ్, మన్నం వెంకటరమణ, యార్లగడ్డ వెంకటరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నిధి ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం అన్నపూర్ణస్టూడియోలో హీరోహీరోయిన్లపై ముహూర్తపు షాట్ చిత్రీకరించారు. దీనికి దాసరి నారాయణరావు క్లాప్ కొట్టగా, తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విచ్చాన్ చేశారు. పూరీ జగన్నాథ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ... "ఆపరేషన్ దుర్యోధన", "యమగోల మళ్ళీ మొదలైంది" తర్వాత చేస్తోన్న ఈ చిత్రం హ్యాట్రిక్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. నిధిప్రసాద్‌తో తనకిది రెండవ చిత్రమని, పూర్తివినోదభరిత చిత్రమిదని చెప్పారు. దర్శకుడు నిధిప్రసాద్ మాట్లాడుతూ.. "భాగ్యలక్ష్మి బంపర్ డ్రా" తర్వాత చేస్తున్న చిత్రమిది. రొమాంటిక్, కామెడీ, ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు. అక్టోబర్ 1 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి డిసెంబర్ నాటికి పూర్తిచేస్తామని వెల్లడించారు. ఇందులోని ఆరు పాటలూ రికార్డింగ్‌లో ఉన్నాయని తెలిపిన ఆయన హైదరాబాద్, గోవా, వైజాగ్ ప్రాంతాల్లో షూటింగ్ పూర్తిచేస్తామని అన్నారు. తాను "భాగ్యలక్ష్మి బంపర్ డ్రా"లో నటించానని, అంతటి విజయాన్ని ఈ చిత్రం చవిచూస్తుంగని కొండవలస ఆకాంక్షించారు. పాత్రలకనుగుణంగా విలన్లుకూడా కామెడీని పండిస్తారని బెనర్జీ చెప్పారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.