|
|
|
రాజీవ్‌కనకాల, నరేష్ ప్రధాన పాత్రలను పోషిస్తున్న విశాఖ ఎక్సెప్రెస్ చిత్రంలో ప్రీతి జింగానియా, సింధుతులానీ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. మార్కెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ముళ్లపూడి దర్శకత్వ సారథ్యాన చిత్రీకరించబడుతోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌తో పాటు డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం రీ రికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఎలాంటి హింసకు చోటివ్వకుండా కేవలం తమ పాత్రలు చుట్టూ తిరిగుతూ ఉండే కథాంశంగా తెరకెక్కించినట్లు చెప్పారు. ప్రేక్షకులకు ఒక్కసారిగా హాయిని గొలిపే సన్నివేశాలను చిత్రీకరించామన్నారు. ఈ సన్నివేశాలు ఆహ్లాదకరంగాను ఉంటాయని చెప్పారు. అలాగే వినోదాన్ని కూడా కాస్త జోడించామన్నారు. అనంతరం రాజీవ్ మాట్లాడుతూ అద్యంతం వినోదభరితంగా సాగే ఈ చిత్రంలో అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. చివరగా ఈ చిత్రం ఎగ్జిక్యూటివ్ నిర్మాత పూర్ణ చంద్ర మాట్లాడుతూ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబర్ కంతా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి సమర్పించిన స్క్రీన్‌ప్లే చాలా బాగుంటుందని, చిత్రంలో హైలెట్‌గా నిలుస్తుందన్నారు.
|
|