|
ఆర్.పి.పట్నాయక్ ఆల్రెడీ సంగీత దర్శకుడిగా బాగానే పేరు సంపాదించుకున్నాడు. అలా ఉన్నవాడు ఉండక హీరోగా కూడా రాణిస్తానని 'శ్రీను..వాసంతి..లక్ష్మి' చిత్రంలో చేశాడు. అది కాస్త ఫ్లాప్‌గా నిలవడంతో మళ్లీ సంగీతంపైనే దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు దర్శకుడిగా కూడా మారిన సంగతి తెలిసిందే. ఈయన తీస్తోన్న చిత్రం పేరు 'అందమైన మనసులో'. ఈ చిత్రాన్ని ఎస్.వి.బాబు నిర్మిస్తున్నారు. అయితే ఇలా పలు శాఖల్లో ఆర్.పి.తనను తాను టెస్ట్ చేసుకుంటూ ఉండడంతో పలువురు విమర్శిస్తున్నారట. అయితే ఆర్‌పి మాత్రం తను ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేస్తానని అందుకే తను చేసే పనిలో విజయం సాధిస్తానని చెబుతున్నాడు. ప్రతీ చిత్రానికిస్ అంగీతం అందించేప్పుడు చిత్తశుద్ధితో పని చేస్తాడట. అలాగే ఇప్పుడు దర్శకత్వాన్ని కూడా చిత్తశుద్ధితో నిర్వర్తిస్తున్నాడట. అందుకే తన దర్శకుత్వంలో రాబోయే చిత్రం కూడా ప్రతీ ప్రేక్షకుని హృదయాన్ని తాకుతుందట. తప్పకుండా విజయం సాధిస్తానని చెబుతున్నాడు. ఏది ఏమైనా ఆర్.పి.పట్నాయక్ సంగీత దర్శకత్వంలో ఎలాగైతే విజయ ఢంకా మోగించాడో దర్శకత్వంలో కూడా తన ప్రతిభలో అందర్నీ మెప్పించాలని ఆశిద్ధాం.
|