|
|
 |
ప్రస్తుతం టాప్‌లిస్ట్‌లో చేరిన హీరోయిన్స్‌లో త్రిష స్థానం నెంబర్‌వన్ ఆమే నటించిన సినిమాలన్ని తెలుగుకి అనువదించి వేసారు. హిట్ అయినా సరే లేక ఫట్ అయినా సరే. త్రిషకు స్టార్ హీరోలకు తీసిపోని ఫ్యాన్స్ క్లబ్స్ వున్నాయి. అందుకే ఇప్పుడు రివర్స్‌లో తెలుగులో ఆమె నటించిన సినిమాలన్ని తమిళ్‌కు తీసుకెళుతున్నారు. వీటిలో ఫ్లాప్ లిస్ట్ కూడా వుంది. 'అతడు' చిత్రాన్ని 'నందు' పేరుతో డబ్ చేయగా, 'సైనికుడు' చిత్రాన్ని 'కుమరన్' పేరిట డబ్ చేసారు. తాజాగా ఇక్కడ ప్లాప్ అయిన 'పౌర్ణమి'ని కూడా తీసుకెళ్ళారు. మొన్నటిదాక ఇక్కడ ఒకవెలుగు వెలిగిన త్రిషకి ఇప్పుడు పరాజయాలు అక్కడక్కడా ఎదురవుతున్నాయి. ఫ్లాప్ సినిమాలు చాలా చీప్ రేట్లకు దక్కించుకుని తమిళ్‌లో డబ్బులు దండుకోవచ్చని ప్లాన్ అనుకుంటా. కాని హిట్ అయినా ఫట్ అయినా త్రిష మాత్రం చాలా హాట్ గురూ అంటున్నారు ఆ అనువాద నిర్మాలంతా...
|
|