|
|
 |
ఇప్పటి వరకు కుటుంబ కథాల చిత్రాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చిన విక్టరీ వెంకటేష్ తాజాగా పురాణ, చారిత్రాత్మక కథా చిత్రాలపై ఆసక్తి చూపిస్తున్నారు. 'స్వామి వివేకానంద' చిత్రంలో నటించనున్నట్టు గతంలో పలు ఊహాగానాలు వచ్చిన విషయం తెల్సిందే. అయితే.. ప్రస్తుతం ఈ ఊహాగానాలు నిజం కానున్నాయి. వెంకటేష్ తదుపరి చిత్రంగా 'స్వామి వివేకానంద' చిత్రాన్ని చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఫిల్మ్ వర్గాలు వినికిడి. ఈ చిత్రానికి భక్తిరస చిత్రాను వెండి తెరకెక్కించడంలో అందెవేసిన చేయిగా పేరుగాంచిన దర్శకేంద్రుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించే సూచనలు కన్పిపిస్తున్నాయి. ప్రసుత్తం యువరత్న బాలకృష్ణతో 'రంగా.. పాండురంగా' చిత్రాన్ని దర్శకేంద్రుడు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్ అనంతరం 'స్వామి వివేకానంద' చిత్రంపై దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది.
|
|