|
|
 |
వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో యువరత్న బాలకృష్ణ నటిస్తున్న 'ఒక్కమగాడు' చిత్రంలో బాలకృష్ణ కేశాలంకరణ, వస్త్రశైలి అన్నీ మార్చి చూపించేందుకు దర్శక నిర్మాత చౌదరి ప్రత్యేక శ్రద్ద చూపించారు. ఫ్రీ ప్రొడక్షన్‌లో భాగంగా నాయకా నాయికలకు ఆమెరీకాలో ప్రత్యేకమైన మేకప్ టెస్ట్‌లు చేయించారు. అక్కడ నుండి తీసుకొచ్చిన ప్రత్యేక సామాగ్రితో హీరో బాలకృష్ణకు మేకప్ చేశారు. ఇందుకు సంబంధించిన విషయాల్ని చిత్రవర్గాలు గోప్యంగా వుంచుతున్నాయి. ఈ గెటప్‌కి సమబంధించిన స్కెచ్‌లను ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్‌తో గీయించారు. ఈ పెయింటింగ్స్ కూడా చిత్రంలో కనిపిస్తాయని సమాచారం. బాలకృష్ణ పాత్ర ఈ సినిమాలో భిన్నకోణంలో వుంటుంది. ప్రధానంగా పౌరుషంతో బాలయ్య పలికిన డైలాగ్స్ అభిమానులతో పాటు ప్రేక్షకులకు నచ్చుతాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సీమ చిత్రాలకు బ్రాండ్ అంబసీడర్ లాంటి బాలకృష్ణ 'ఒక్కమగాడు' గా సామాకొల స్పృహవున్న సన్నివేశాల్లో జీవించారు. రౌద్ర రస పోషణలోనే కాదు రొమాంటిక్ సన్నివేశాల్లోనూ ఆయన చాలా అందంగా కనిపిస్తారు. సిమ్రాన్‌తో పాటు అనుష్క, నిషా కొఠారి కూడా ఇందులో ఆడిపాడబోతున్నారు..
|
|