|
|
 |
డీఎస్ రావు నిర్మాణ సారథ్యంలో రూపొందుతోన్న మహారాజశ్రీ చిత్రం ఎస్ఎస్ నివాస్ దర్శకత్వంలో చిత్రీకరించబడుతోంది. రిషి, నిఖిత, అనుమెహతా హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సాయికృప ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. రాశి ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, శ్రీలేఖ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ కథ నచ్చడంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రేక్షకులు ఊహించని రీతిలో యాక్షన్ సన్నివేశాలతో పాటు, ప్రేమ సన్నివేశాలను తెరకెక్కించామన్నారు. నటులు సాయికుమార్, వినోద్ కుమార్ ముఖ్యపాత్రను పోషించడం విశేషంగా చెప్పారు. అభినయశ్రీ, వేణుమాధవ్‌లపై ప్రత్యేక పాటను చిత్రీకరించామని, ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకోనున్నట్లు తెలిపారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబర్‌లో సుప్రీం ద్వారా ఆడియోతో పాటు అదే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు. అలాగే ప్రస్తుతం రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలిపారు.
|
|