|
చిరంజీవి సినిమాలు చూడడం వలననే తను డాన్స్ అంతబాగా చేయగలుగుతున్నానని హాస్యనటుడు సునిల్ అంటున్నారు. చిన్నప్పుడు చిరంజీవి సినిమాలు చూసి ఆయన వేసిన స్టెప్పులను ఇంటిదగ్గర ప్రాక్టీసు చేయడం వలననే తనకు డాన్స్ చేయడం బాగా వచ్చని అన్నాడు. కామెడీ పాత్రలనే అధికంగా చేసే సునీల్ కు విలన్ గా కూడా చేయాలని ఉందట. అయితే తన బాడీ షేప్ ను మార్చుకున్న తరువాతే విలన్ పాత్రను చేస్తానని అంటున్నాడు. చిన్నప్పుడు స్కూల్లో డ్రామా వేసినపుడు విలన్ పాత్ర వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందన్న సునీల్ సినిమాలలో అలా జారిపోకుండా చూసుకుంటానని అన్నాడు. బెస్టాఫ్ లక్.
|