|
|
 |
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో తన ప్రతిభని చాటుకున్న శ్రియ హాలివుడ్ రంగ ప్రవేశం కూడా చేస్తున్న విషయం విదితమే. 'ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్' అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఇందులో శ్రియ క్యారెక్టార్ పేరు ప్రియ అని తెలిసింది. ఈ చిత్రంలో ప్రియగా శ్రియ పక్కింటమ్మాయిలా కనిపిస్తుందట. ప్రియ పాత్ర సౌత్ ఇండియన్ ట్రెడిషన్‌కి దగ్గరగా ఉండటంవల్లే తనని ఎన్నుకున్నారని శ్రియ చెప్పింది. 'శివాజీ'కి ముందు తనకి పాపులార్టీ ఉన్నప్పటికీ ఆ చిత్రం విడుదలైన తర్వాత తన రేంజ్ మరింత పెరిగిందని అంటోంది శ్రియ.. అందుకే హాలివుడ్ చిత్రానికి కూడా అవకాశం వచ్చి ఉంటుందేమో...
|
|