|
|
 |
తన భర్త శిరీష్ భరద్వాజ్ క్షేమం కోరుతూ మెగాస్టార్ చిరంజీవి కూతురు సోమవారం ఉపవాస దీక్ష తీసుకుంది. శిరీష్ కు ఇంకా ప్రమాదం పొంచి ఉందని చెబుతున్న ఆమె ఈ దీక్ష చేపట్టడం విశేషం. తాను కోట్ర రూపాయలు కోరుకోలేదని, తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని ఆమె సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పింది. నాన్నగారు తనను బాగా చూసుకున్నారని, అయితే బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంచారని ఆమె చెప్పింది. తమ వెనక రాజకీయ నాయకులు ఎవరూ లేరని శిరీష్ భరద్వాజ్ అన్నాడు. తమను ఆశీర్వదిస్తున్నట్లు చిరంజీవి మీడియా ముందుకు వచ్చి మరోసారి చెప్పాలని ఆయన కోరారు. శ్రీజ దంపతులకు హైదరాబాదులో కూడా రక్షణ కల్పించాలని శిరీష్ భరద్వాజ్ తండ్రి కోరారు.
|
|