తన కుమార్తె శ్రీజ చేసుకున్న ప్రేమ వివాహం విషయంలో గాని శ్రీజ దంపతులపై గాని తమకుగాని తమ కుటుంబానికి ఎలాంటి క్రోధం లేదని మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేసారు. శ్రీజ లాయర్ పిమికీ ఆనంద్‌కు రాసిన లేఖలో ఆ విషయాన్ని పేర్కొన్నారు. శ్రీజ ప్రేమ వివాహాన్ని తాము ఆమోదించామని, ఆశీర్వదించామని అయినా వారు పదేపదే జాతీయ మీడియాల్లోకి ఎక్కి మాట్లాడటం తమకు బాధ కలిగించిందని ఆ లేఖలో పొందుపరిచారు.