విడుదలకు సిద్దంగావున్న భజంత్రీలు
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

 కామెడీ ప్రధానాంశంగా రూపొందుతున్న భజంత్రీలు చిత్రంలో శివాజీ, విక్రమ్‌లు కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కె దేవీవరప్రసాద్ సమర్పిస్తుండగా, దేవీ ఐశ్వర్య నిర్మిస్తున్నారు. అలాగే ఎం ఎస్ నారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం చక్రి అందిస్తున్నారు. ఇది కుటుంబకథా చిత్రంగా తెరకెక్కినట్లు సినీవర్గాలు వెల్లడించాయి. దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 1న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. దాసరి నారాయణరావు గారు ఇచ్చిన టైటిల్ ఈ చిత్రానికి సరిపోతుందని దేవీవరప్రసాద్ చెప్పారు. అలాగే కొటశ్రీనివాసరావు గారి పాత్ర, ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు, సెంటిమెంట్స్ అన్ని చాలా బాగా కుదిరాయని తెలిపారు. దర్శకుడు ఎంఎస్ నారాయణ మాట్లాడుతూ మహోన్నత నటుడు దివంగత రావుగోపాలరావు ఇందులో ఎలా నటించారనేది చిత్రంలో చూడాల్సిందేనన్నారు. ఈ చిత్రానికి సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలుపుతూ తను అభిమానించే వ్యక్తి ఎన్టీఆర్‌కు ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరించే చిత్రం అవ్వగలదన్నారు. దేవి ఐశ్వర్య మాట్లాడుతూ ఆంధ్రుడు, సీమశాస్త్రి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన తాను తమిళ చిత్రం బోస్‌కు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా రాష్ట్ర ప్రభుత్వ అవార్డును గెలుచుకున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించి నిజజీవితంలో ఎదురయ్యే వ్యక్తుల నడవడికను తెరకెక్కించినట్లు నటుడు శ్రీధర్ చెప్పారు. ఇండస్ట్రీలో విక్రమ్ పేరుతో చాలా మంది ఉన్నారని, అయితే ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్న తన కొడుకు పేరు ఎం ఎస్ విక్రమ్ అని తెలిపారు. ఎస్ అంటే సవ్యసాచి అని, తన కుమారుడిని సవ్యసాచిగా పరిచయం చేస్తున్నానని శ్రీధర్ చెప్పారు. అలాగే ప్రత్యేక ఆకర్షణగా ముమైత్‌ఖాన్‌తో ఒక పాటను చిత్రీకరించామని పేర్కొన్నారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.