|
|
 |
నటకిరీటి రాజేంద్రప్రసాద్ 2006-07 సంవత్సరానికి మాస్టర్ ఆఫ్ స్మైల్ అవార్డుకు ఎంపికైనట్లు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రకటించింది. తన సీరియస్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి అభిమానులకు బాగా చేరువైన ఈ నటకిరీటికి అరుదైన ఈ అవార్డు దక్కటం విశేషం. రేలంగి నరసింహారావు ఆధ్వర్యాన అవార్డ్ కమిటీ ఈ మేరకు అవార్డీలను ఎంపిక చేసింది. ఇందులో సభ్యులుగా డా బీవీ పట్టాభిరామ్, ప్రదీప్‌లు వ్యవహరించారు. ఈ అవార్డులను అక్టోబర్ 28న జరిగే లలితకళాతోరణంలో జరిగే కార్యక్రమంలో ఇవ్వనున్నట్లు ప్రదీప్ చెప్పారు. మాస్టర్ ఆఫ్ స్మైల్ అవార్డుకు రాజేంద్రప్రసాద్ ఎంపిక కాగా, రమాప్రభ, ఏవీఎస్, భరణి, బాబుమోహన్‌లు స్టార్ కమేడియ్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రం యమగోల, ఉత్తమ దర్శకుడు శ్రీనువైట్ల, ఉత్తమ హీరో శ్రీకాంత్, ఉత్తమ నటుడు అల్లరి నరేష్, ఉత్తమ నటి మమతామోహన్‌దాస్ అవార్డులకు ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ సహాయనటుడు సునీల్, ఉత్తమ సహాయనటిగా హేమ, ఉత్తమ కేరక్టర్ నటుడిగా జయప్రకాష్ రెడ్డి, ఉత్తమ కేరక్టర్ నటిగా తెలంగాణా శకుంతల, ఉత్తమ ప్రతినాయకుడిగా నాజర్, విలక్షణ నటులుగా కృష్ణభగవాన్, రఘుబాబు, ఉత్తమ మాటల రచయితగా కోనవెంకట్లు అవార్డులకు ఎంపికయ్యారు.
|
|