3న పెద్ద పండుగ
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

 గోపిచంద్‌, అనుష్క జంటగా జగపతిబాబు ప్రత్యేక పాత్ర పోషించిన 'లక్ష్యం' చిత్రం ఇటీవల విజయవంతంగా నూరు రోజులు పూర్తి చేసుకుంది. లక్ష్మీనరసింహా ప్రొదక్షన్స్‌ పతాకంపై నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మించగా, శ్రీనివాస్‌ అనే యువకుడు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. గోపీచంద్‌ కెరీర్‌లోనే ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకోగా, 'పెళ్లయిన కొత్తలో', 'సామాన్యుడు' చిత్రాల తర్వాత జగపతిబాబుకు గ్యాట్రిక్‌ లభించింది. ప్రేక్షకాదరణతో విజయవంతమైన ఈచిత్రం శతదినోత్సవ వేశుకను ప్రేక్షకాభిమానుల సమక్షంలోనే నిర్వహించేందుకు నిర్మాత బుజ్జి నిశ్చయించారు. నవంబార్‌ 3వ తేదీన లలిత కళాతోరణంలో 100 రోజుల వేడుకను ఘనంగా పాల్గొనబోతున్నారు. నిర్మాత బుజ్జికి ఇది రెండో విజయం. తొలత వెంకటేష్‌ హీరోగా 'లక్ష్మీ' వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని ఆయన నిర్మిచారు. రెండో చిత్రం సైతం ఇప్పుడు ఘనవిజయం సాధించడంతో తదుపరి చిత్రానికి సైతం ఆయన శరవేగంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా సిద్దర్ధ ('ఆట' ఫేమ్‌) ఎంపికయ్యారు. అతి త్వరలోనే ఈ చిత్రం సెట్సెపైకి రాబోతోందిం.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.