కమల్ హాసన్  డ్రీమ్ ప్రాజెక్ట్ వెల 500 కోట్లు !
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

 భారత దేశం గర్వించదగ్గ నటులలో ఒకరు కమల్ హాసన్. పరిచయం అక్కరలేని ఈ నటుడి కల "మరుదనాయగం" చిత్రంలో నటించాలని. అందుకోసం కొన్ని సంవత్సరాల క్రితమే కథ, కథనం సహా ట్రైలర్ని కూడా కమల్ హాసన్ రూపొందించారు. అయితే అంచనాలకు మించిన బడ్జెట్ వల్ల ఈ చిత్రం కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లోనే ఉంది. ఈ చిత్ర రమారమి ప్రస్తుత బడ్జెట్ సుమారు 500ల కోట్ల రూపాయలు. కానీ తన జీవిత చరమాంకంలోగా ఈ చిత్రం చేయాలనే స్థిర చిత్తం కమల్ హాసన్ లో ఉంది. అతని స్థిర చిత్త ఎంత బలమైనదంటే ఈ చిత్రం కోసం నిర్మించిన ట్రైలర్ కే సుమారు రెండు కోట్ల రూపాయలను ఆయన ఖర్చు పెట్టారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.