|
|
|
కోటి రూపాయల పారితోషికం అందుకుంటున్న కథానాయికగా ఇలియానా గుర్తింపు తెచ్చుకొంది. తెలుగుతోపాటు హింది పైన కన్నేసిన ఈ గోవా ముద్దు గుమ్మ ప్రస్తుతం బిజీబిజీ. కాస్త తీరిక దొరికితే ఇలియానా ఏం చేస్తుంటుంది? అన్న సందేహం రావచ్చు. ఆ ప్రశ్నే వదిలితే 'ఖాళీ సమయాల్లో నిద్ర పోతాను. ఫ్రెండ్స్‌తో కబుర్లు చెబుతాను' లాంటి రొటీన్ సమాధానం మాత్రం ఆమె నుంచి రాదు. "మనం శుభ్రంగా టిప్‌టాప్‌గా తయారైతే సరిపోతుందా? మన ఇల్లు కూఉడా పద్దతిగా ఉండాలి. అందuుకేఇంట్లె ఉంటeేచాలు అంతా జాగ్రత్తగా సర్ది, శుభ్రం చేస్తాను. ఎక్కడాచిందరవందర్గా ఉండకూడదు. మాసిపోయిన బట్టల్ని అలా గుట్టగా పడేయడమే ఇష్టముందదు. వాటి పనీపడతాను. ఇక ఆ తరవాత తీరిక చేసుకొని నా చెల్లెలుకీ, తమ్ముడికీ పాఠాలు చెబుతాను. సినిమాల్లో స్టార్ అయినంత మాత్రాన ఇంట్లోనూ అలాగే ఉండటం నాకు చేత కాదు అని చెబుతుంది.
|
|