|
|
 |
అయ్యో పెద్ద తప్పు చేశానే అని ఇలియానా ఒకటే ఫీల్ అవుతోందట. తెలుగులో అవకాశాలు వెల్లువలా వచ్చినా ఒప్పుకోకపోవడంతో వచ్చిన అవకాశలన్నిటీని చేస్తూ నయనతార హిట్స్ కొట్టేస్తోంది. అవకాశాల పరంగా చూస్తే నయనతార నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. పోకిరి సినిమా తరువాత ఒక్కసారిగా డిమాండ్ పెరిగినా దానిని ఉపయోగించుకోకపోవడాన్ని తప్పుచేసినట్టుగా ఇలియానా భావిస్తోంది. పవన్ కళ్యాణ్ తో ఇలియానా జల్సాలో నటిస్తూ మంచి పనే చేస్తున్నా, నయనతార స్పీడ్ కు బెదిరి తరుణ్ తో సినిమాకు ఒప్పుకోవడం పెద్ద తప్పుగా ఆమె ఫీల్ అవుతోంది. చాన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న తరుణ్ తో సినిమాకు ఒప్పుకోవడం మంచి నిర్ణయం కాదేమోనని ఇలియానా ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది. రెమ్యునరేషన్ కోటికి తగలడంతో ఆ తరుణ్ తో సినిమాకు ఒప్పుకున్న ఇలియానా ఇపుడు బాధపడుతోంది. సినిమా వారం కిందనే ప్రారంభం అయింది.
|
|