|
|
|
అనిల్, పూనమ్ సింగార్ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్నఫ్రెండ్స్ కాలనీ చిత్రాన్ని సాయివంశీ క్రియేషన్స్ పతాకంపై రూపొందించారు. అచ్చన శ్రీనివాస్ దర్శకత్వ సారథ్యాన రూపొందిన ఈ చిత్రం బెల్లంకొండ శివకుమారి సమర్పణలో యు.వెంకట్రావు నిర్మాణ సారథ్యంలో చిత్రీకరించబడింది. ప్రస్తుతం ఈ చిత్రానికి షుటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తయిన సందర్భంగా చిత్రానికి పని చేసిన పలువురు మాట్లాడుతూ స్వశక్తితో పైకొచ్చిన నలుగురు నిరద్యోగుల కథే ప్రధానాంశంగా తెరకెక్కించామని చెప్పారు. కడపజిల్లాలో ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి భారీ సన్నివేశాన్ని చిత్రీకరించామన్నారు. ఈ చిత్రానికి భోలే అందించిన సంగీతం హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు. ఈ చిత్రంలో ఇంకా చలపతిరావు, జీవా, సత్యం, లక్ష్మీపతి, నరసింహరాజు, సోనీ చరిష్టా, రఘుబాబు, అన్నపూర్ణ, అభినయశ్రీ, తిరుపతి ప్రకాష్, హేమ, నమ్రత, జ్యోతిశ్రీ, జగదీశ్వరి తదితరులు నటిస్తున్నారు. అలాగే కెమెరా శ్రీనివాస్ షూట్ చేస్తుండగా, మాటలు ఎస్‌బీ రమణ ఇస్తున్నారు.
|
|