130 ప్రింట్లతో 'వియ్యాలవారి కయ్యాలు' విడుదల
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

 ఉదయ్‌దిరణ్‌, నేహాజుల్కా,శ్రీహరి ప్రధాన పాత్రల్లో ఇ.సత్తిబాబు దర్శకుడిగా లార్‌స్కో పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మించిన 'వియ్యాలవారి కయ్యాలు' చిత్రం ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్‌ 1న తేదీ గురువారంనాడు 130 ప్రింట్లతో రాష్ట్రవ్యాప్తంగా విడుదలవుతోంది. 'ఎవడిగోల వాడిది', 'స్టైల్‌' చిత్రాలు సకెస్స్‌ తర్వాత వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గదని చిత్ర సమ్ర్పకుడు లగడపాటి శ్రీధర్‌ అంటున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రివ్యూను ఆయన పలువురు సినీ ప్రముఖులకు చూపించారు. 'ప్రివ్యూ చూసిన అందరూ మంచి సినిమా తీశావంటూ అభినందిస్తున్నారు. ముఖ్యంగా శ్రీహరి క్యారెక్టర్‌ అందరి ప్రశంసలు అందుకుంటోంది అని ఆయన తెలిపారు. శ్రీహరి చాలామంచి ఆర్టిస్టు అనే విషయం అందరికీ తెలిసిందేననీ, ప్రస్తుతం ఉన్న నటుల్లో అన్ని ఎమోషన్లు పలికించగల సమర్థుడు శ్రీహరి అనిఅ అయన ప్రసంసించారు. యంగ్‌ జనరేషన్‌ను దృష్టిలో పెట్టుకున్ని తీసిన ఈ సినిమాలో శ్రీహరి క్యారెక్టర్‌ పెద్ద హైలైట్‌ అవుతుందని చెప్పారు. ప్రివ్యూకు హాజరైన శ్రీహరి మాట్లాడుతూ, ప్రివ్యూ చూసిన తర్వాత తన కళ్లను తానే నమ్మలేకపోయాననీ, ఈ చిత్రం తప్పనిసరిగా 100 రోజులు ఆడుతుందనే నమ్మకం తనకుందని స్పష్టం చేశారు. ఈ సినిమా చూసిన తర్వాత పెద్దవాళ్లను చిన్నవాళ్లు గౌరవించడం మొదలు పెడతారని అన్నారు.'కుటుంబ విలువలు, అనుంబంధాలను ఎంతో ఉద్దత్తంగా సినిమాలో చూపించారు. ఇందులో నా పాత్ర పేరు భూపతిరాయుడు. హీరోయిన్‌ సోదరుడిగా నటించా. ఇటీవల కాలంలో నేను నటించిన క్యారెక్టర్లలో ఆ ణిముత్యమ్లాంటి పాత్ర ఇది. ప్రేక్షకులకు సైతం చాలాకాలం నా పాత్ర గుర్తుండిపోతుంది' అని శ్రీహరి ధీమా వ్యక్తం చేశారు.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.