|
నేను సినిమాని ఎప్పుడైతే బాగా ఎంజాయ్ చేస్తోనో ఆ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది. ఎప్పుడు ఘాటింగ్ అవుతుందా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని రోజు ఘాటింగ్ సమయంలో అనుకుంటానో ఇక ఆ సినిమా సంగతి అంతే. అట్టర్ ఫ్లాప్ అవుతుంది. 'అతిథి' చిత్రానికి చాలా ఎంజాయ్ చేశాను. అందుకే ఈ చిత్రంపై నాకు బాగా గురి ఉంది. సురేందర్ రెడ్డి గొప్ప టెక్నీషియన్. ఆయనతో చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఇక నా క్రాఫ్ ని అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే ఘాటింగ్ అయ్యాక వెంతనే కత్తిరించేశాను. ఆ క్రాఫ్ చాలా బాగా ఉన్నా కూడా రోజూ దాన్ని మెయిన్ టెయిన్ చేయడం చాలా కష్టం. రోజు రకరకాల షాంపులను ఆయిల్ అంటూ రాస్తూ జాగ్రత్తగా హెయిర్ ని పెంచుకోవాలి. ఏదో సినిమా వరకైతే పర్వాలేదు కానీ ఎప్పటికీ అలాగే ఉండాలంటే చాలా కష్టం అంటున్నాడు మహేష్ బాబు. దీన్ని బట్టి చూస్తే మహేష్ బాబుకి ఏ సినిమా హిట్ అవుతుందో ఏది ఫ్లాఫ్ అవుతుందో ముందే తెలిసిపోతుందన్నమాట.
|