|
భారత్ లో మరో ట్రిలియనీర్ మొన్న ముఖేష్ అంబానీ, నిన్న అనీల్ అంబానీ... నేడు కుషాల్ పాల్ సింఘ్.. రోజురోజుకీ పెరుగుతున్న సెన్సెక్స్ తో దేశంలో ట్రిలియనీర్ల జాబితా కూడా పెరుగుతోంది. సోమవారం రియలెస్టేట్ కంపెనీ డి.ఎల్.ఎఫ్ లిమిటెడ్ మార్కెట్ విలువ నాలుగుశాతం పెరగడంతో కంపెనీ ఛైర్మన్ కుశాల్ పాల్ సింఘ్ లక్ష కోట్ల సంపద(ట్రిలియనీర్) గల వారిలో స్ధానం సంపాదించుకున్నారు. రూపాయి మారకంలో ఆయ్న కంపెనీ సంపద అక్షరాలా 1,14,744 కోట్ల రూపాయలు. మార్కెట్లో డి.ఎల్.ఎఫ్ షేరు 4.07 శాతం పెరిగి బీఎసీలో 673.05 కోట్ల రూపాయల వద్ద ముగిసింది. మొత్తం ట్రేడింగ్ సెషన్ ముగిసిన తర్వాత నికర సంపద విలువ 1,01,250 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇంతకుమునుపే ట్రిలియనీర్ల జాబితాలో చేరిన ముఖేష్ అంబానీ సంపద విలువ 1,61,000 కోట్ల రూపాయలకు, అనిల్ అంబానీ సంపద విలువ 1,05,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. ప్రస్తుతం డి.ఎల్.ఎఫ్ లో సింగ్ కు 88.24 శాతం వాటా ఉంది. డాలర్లలో సంపదను లెక్కగడితే అంబానీ సోదరుల తర్వాత 25.21 బిలియన్ డాలర్లతో కుశాల్ పాల్ సింఘ్ మూడో స్ధానంలో ఉండగా, భారతీ ఎయిర్ టెల్ సీఈఓ సునీల్ మిట్టల్ 22 బిలియన్ డాలర్ల నాలుగవ స్ధానంలోనూ, 14.6 బిలియన్ డాలర్లతో విప్రో ఛైర్మన్ అజీం ప్రేంజీ ఔదో స్ధానంలోనూ ఉన్నారు. |
| Close |