|
|
 |
ప్రముఖ భారతీయ కమ్యూనికేషన్ రంగ సంస్థ ఎయిర్‌టెల్ శుక్రవారం సూపర్ లైఫ్‌టైమ్ ప్రీ పెయిడ్ అనే పేరుతో ఒక కొత్త టారిఫ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ ప్రకారం యూజర్ వద్ద నుంచి ఔట్ గోయింగ్ లోకల్ కాల్‌కు రూ.1 ఛార్జీలను వసూలు చేస్తారు. ఈ టారిఫ్‌ను పొందదలచే కస్టమర్లు రూ. 999 మాత్రమే చెల్లించాలి. అయితే వారు ప్రతి 180 రోజులకు కనీసం రూ.200 వినియోగించుకోవాల్సి ఉంటుంది. అలా జీవితకాలం వేలిడిటీ ప్రయోజనాలను పొందవచ్చు. ఈ విషయమై ఎయిర్‌టెల్ కంపెనీ మొబైల్ సేవ విభాగం అధ్యక్షుడు సంజయ్ కపూర్ మాట్లాడుతూ ప్రస్తుత వినియోగదారులతోపాటు, కంపెనీ కొత్త యూజర్లకు కూడా శనివారం నుంచి సూపర్ లైఫ్‌టైమ్ ప్రీ పెయిడ్ ప్లాన్ అందుబాటులోకి వస్తుందని వివరించారు.
|
|