|
|
|
ఆర్థిక, ఐటీ, రిటైల్, ఏవియేషన్ రంగాలకు చెందిన ఎనిమిది భారతీయ కంపెనీలు వచ్చే ఏడాది హాంకాంగ్‌లో పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇన్వెస్ట్ హాంకాంగ్ అసోసియేట్ డైరెక్టర్ జనరల్ సిమోన్ గాల్పిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఎనిమిది భారతీయ కంపెనీలతో తాము పెట్టుబడులపై చర్చలు జరిపామని చెప్పారు. వివిధ రంగాలకు చెందిన ఈ సంస్థలు హాంకాంగ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు తమ చర్చల్లో సుముఖత వ్యక్తం చేశాయని ఆయన అన్నారు. ఆయితే ఈ సంస్థల పెట్టుబడుల విలవను మాత్రం వెల్లడించేందుకు గాల్పిన్ నిరాకరించారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియా, భారతీయ స్టేట్ బ్యాంకు వంటి 20 ప్రముఖ భారతీయ సంస్థలు హాంకాంగ్‌లో పెట్టుబడులు పెట్టినట్లు ఆయన చెప్పారు. భారత్- హాంకాంగ్‌ల మధ్య వాణిజ్యం 2006లో 7.67 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కొత్త సంస్థల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబర్చడంతో ఈ ఏడాది వాణిజ్య విలువ ఇంకా పెరిగే అవకాశముందని గాల్పిన్ అన్నారు.
|
|