దీపావళికి కొత్త ఆఫర్లు ప్రవేశపెడుతున్న టాటా ఇండీకామ్‌
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

 రానున్నదీపావళి పండుగ సీజన్‌లో ప్రముఖ టెలికమ్ సంస్థలు తమ వినియోగదారులకు కొత్త పథకాలను ప్రారంభించాయి. కంపెనీ వినియోగదారుల సంఖ్య రెండు కోట్లకు చేరిన సందర్భంగా స్ర్ర్కాచ్ అండ్ విన్ మెగా ఆఫర్‌ను ప్రవేశపెడుతున్నామని టాటా ఇండికామ్ తెలిపింది. ప్రతి కొత్త కనెక్షన్‌తో బాటు ఇచ్చే స్ర్కాచ్ కార్డు ద్వారా గెలుపొందిన వారికి 6 టాటా సఫారీలు, 10 టాటా ఇండికామ్ కార్లు, 150 బైకులు, 500 కలర్ టీవీలు బహుమతులుగా ఇవ్వనున్నామని సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ వినాయక్ దేశ్‌పాండే తెలిపారు. అలాగే కొత్త కనెక్షన్‌తో రూ. 25 టాక్ టైం ఉచితంగా ఇవ్వనున్నామని ఆయన చెప్పారు. కాగా ఎయిర్‌టెల్ సంస్థ తన వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్-హ్యువాయ్ పేరుతో రూ. 1199లకే హ్యాండ్‌సెట్, ఒక ఏడాది ఇన్‌కమింగ్‌ను ఇచ్చే విధంగా కొత్త ఆఫర్ ప్రకటించింది. తద్వారా మొబైల్ మార్కెట్లో ఏర్పడుతున్న పోటీకి తాము సిద్ధమేనని ప్రకటించుకుంది.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.