|
ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంకు రెండో త్రైమాసికంలో రూ.95.33 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఏడాదితో పోలిస్తే సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసిక నికరలాభంలో 37.24 శాతం వృద్ధి సాధించామని శుక్రవారం ఫెడరల్ బ్యాంకు స్టాక్ ఎక్సేంజ్‌కు తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ తమ నికరలాభం రూ.69.46 కోట్ల వద్దeేఉందని బ్యాంకు వెల్లడించింది. ఈ రెండో త్రైమాసికంలో బ్యాంకు ఆదాయం కూడా 33.33 శాతం మేర వృద్ధి చెందింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.506.32 కోట్లు కాగా ప్రస్తుతం రూ.675.06 కోట్లకు చేరుకుందని ఫెడరల్ బ్యాంకు వివరాలు అందించింది.
|