|
|
 |
ప్రపంచ సంపన్నులలో నెంబర్ వన్ స్థానాన్ని రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేష్ అంబానీ ఆక్రమించగా, బిల్ గేట్స్ మూడో స్థానానికి పడిపోయారు. భారత స్టాక్ మార్కెట్ జోరుతో ముకేష్ ఈ ఘనత సాధించినట్లయింది. ప్రస్తుతం ముకేశ్ ఆస్తుల విలువ 63.2 బిలియన్ డాలర్లు కాగా, 62.2993 బిలియన్ డాలర్లతో కార్లోస్ స్లిమ్ రెండో స్థానంలో, 62.29 బిలియన్ డాలర్లతో బిల్ గేట్స్ మూడో స్థానంలో నిలిచారు. అలాగే వారెన్ బఫెట్ 55.9 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానాన్ని, ప్రవాస భారతీయుడైన స్టీలు సామ్రాజ్యాధిపతి లక్ష్మీ మిట్టల్ 50.9బిలియన్ డాలర్లతో ఐదో స్థానాన్ని ఆక్రమించారు. మరోవైపు ముకేశ్ సోదరుడు అనిల్ అంబానీ ఆస్తుల విలువ 38.5 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో వారి కుటుంబ ఆస్తి మొత్తం వంద బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. ఇప్పటివరకు కుటుంబ ఆస్తుల విషయంలో వాల్టన్స్ (71బిలియన్ డాలర్లు)లదే గరిష్ట స్థాయి కాగా, ప్రస్తుతం అంబానీలు వారిని మించిపోయారు.
|
|