మరో సంచలనం రేపిన స్టాక్ మార్కెట్
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

 స్టాక్ మార్కెట్‌ సోమవారం లాభాల దిశగా పయనించి ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించి మరో సంచలనం రేపింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 735 పాయింట్లు పుంజుకుని 19,978 వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 204 పాయింట్లు బలపడి 5906కు చేరింది. ఉదయం నుంచి కొనుగోళ్లు భారీ స్థాయిలో సాగడంతో సెన్సెక్స్ త్వరితంగా పురోభివృద్ధి సాధించింది. కేవలం ఆరు సెషన్‌లలో ఒక దశలో 20వేల మార్కును తాకిన సెన్సెక్స్ సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి 735 పాయింట్ల వృద్ధితో 19,978 వద్ద ముగిసింది.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.