|
|
 |
తమ కొత్త బైక్ ఎక్సీడీ 125 డీటీఎస్- ఎస్సై ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించామని బజాజ్ తెలిపింది. వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ రావడంతో తాము ఈ ఉత్పత్తిని పెంచాలనుకుంటున్నామని వెల్లడించింది. ఆ సంస్థ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) అమిత్ నంది మాట్లాడుతూ గత నెలలో దీనిని మార్కెట్లో ప్రవేశపెట్టగా, మొదటి నెలలోనే 65వేల బైక్‌లు విక్రయించామని తెలిపారు. ఈ కారణంగా నవంబర్ నుంచి వీటి ఉత్పత్తిని 50వేల నుంచి 75వేలకు పెంచనున్నామని తెలిపింది. తమ విక్రయాల్లో 50శాతం పోటీదారుల నుంచి వచ్చినవేనన్నారు. అందులోనూ వంద సీసీ బైక్‌లు ఉపయోగించేవారు వీటిపై మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు.
|
|