ఎయిర్‌బస్‌ ఏ380 తొలి ప్రయాణం
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

 ప్రపంచంలో అతిపెద్ద ప్రయాణిక విమానం ఎయిర్‌బస్ ఏ380 తొలిసారిగా ప్రయాణికులతో నింగిలోకి ఎగిరింది.  సింగపూర్‌ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరానికి బయలుదేరిన ఈ విమానంలో 450 మంది ప్రయాణికులున్నారు. ఓ వారం క్రితం ఎయిర్‌బస్ నుంచి ఈ విమానాన్ని సింగపూర్ ఎయిర్‌లైన్స్ పొందింది. 850 మంది ప్రయాణికులను తీసుకెళ్లగల సామర్థ్యం కలిగిన ఈ ఎయిర్‌బస్ ఏ380 విమానం ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద విమానంగా గుర్తింపు పొందింది. నాలుగు దశాబ్దాల నుంచి సాగుతున్న బోయింగ్ 747 హవా ఈ కొత్త సూపర్‌జంబోతో అంతం అయ్యే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. అనేక నిర్మాణ పరమైన సమస్యలతో రెండేళ్ల ఆలస్యంగా బయటికొచ్చిన ఎయిర్‌బస్ ఏ380 బుధవారం తొలిసారి ప్రయాణికులతో సిడ్నీ బయలుదేరి వెళ్లింది.

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.