బ్యాంక్ ఆఫ్ బరోడా గల్ఫ్‌లో సేవల విస్తరణ

' ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంక్ అఫ్ బరోడా గల్ఫ్ దేశాలలో కార్యకలాపాల విస్తరణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బహ్రైయిన్, ఖతార్ నగరాలలో శాఖలు ఏర్పాటుచేయనుంది. ఇప్పటివరకూ యూఏఇలో బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న ప్రధమ భారత విత్త సంస్థ బ్యాంక్ ఆప్ బరోడా మాత్రమే. వీటితో పాటుగా కువైట్‌లో శాఖ ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. బహ్రెయిన్ శాఖ కార్యకలాపాలు సెప్టెంబరులో ప్రారంభం కానుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా స్థాపించి దాదాపు వంద సంవత్సరాలు పూర్తవుతున్న సంగతి విదితమే. బ్యాంక్ ఆఫ్ బరోడాకు ప్రపంచవ్యాప్తంగా 2,700 శాఖలు ఉన్నాయి.

Close