హెల్త్ సుపర్ హైవే కోసం ఐబీఎం, అపోలో ఒప్పందం

హెల్త్ సూపర్ హైవే ప్రాజెక్టు నిర్వహణ కోసం ఇంటర్నేషనల్ బిజినెస్ మిషిన్ (ఐబీఎం)తో అపోలో హాస్పటల్ గ్రూపు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలకు ఆన్‌లైన్‌ ద్వారా వైద్య నిపుణుల సలహాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్ధేశించిన ఈ హెల్త్ సూపర్ హైవే ప్రాజెక్టు కోసం ప్రస్తుతం తాము ఐబీఎంతో ఒప్పందం కుదుర్చుకున్నామని అపోలో గ్రూపు ఛైర్మన్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టులో సగం వాటాను అపోలో గ్రూపు కలిగిఉంటుందని ఆయన పేర్కొన్నారు. సీఐఐ సమావేశంలో పాల్గొన్న డాక్టర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్ రంగ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కూడా ఈ ప్రాజెక్టుపై ఆసక్తి కనబరుస్తోందని అన్నారు.

Close