'అతిథి' మూవీ ముచ్చట్లు
టైంస్ అఫ్ ఆంధ్రా / వార్తా విభాగం

 

    మహేష్ బాబు కథానాయకుడిగా కృష్ణప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రమేష్ బాబు నిర్మించిన చిత్రం అతిథి. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 18 న 600 ప్రింట్లతో ప్రపంచమంతటా విడుదలైంది. కథలోకి వెలితే

    ఢిల్లీ మహానగరం లో ఓ తెలుగు అనాధ బాలుడు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ చాలా నిజాయితీగా బ్రతుకుతుంటాడు. అతనికి ఓ కోటీశ్వరుడి కుమార్తె పరిచయమవుతుంది. క్రమంగా వారిద్దరిమద్య స్నేహం చిగురిస్తుంది. వాళ్ళ స్నేహాన్ని తెలుసుకుని ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ బాలుడిని చేరదీసి చదివించాలనే ఉద్దేశంతో ఆ కోటీశ్వరులైన తల్లిదండ్రులు అతిధిని కారులో తీసుకుని వెలుతుంటే దారిలో ఓ దుండగుడు వారిని అడ్డగించి వారివద్ద ఉన్న ధనమును తీసుకుని వారిని కాల్చి చంపుతాడు. అది చూసిన అతిధి ఆ దుండగుడిపై తిరగబడతాడు. వాడిచేతిలోని రివాల్వర్ ని తీసుకుని వాడిపైనే కాల్పులు జరుపుతాడు. దుండగుడు తన పర్సును అక్కడే పడేసుకుని పారిపోతాడు. ఇంతలో అక్కడికి వచ్చిన పోలీసులు ఆబాలుడే వారిని చంపాడని అనుకుని అరెస్ట్ చేస్తారు.

    ఈ విధంగా ఆబాలుడు 13 సంవత్సరముల జైలుశిక్షను అనుభవిస్తాడు. జైలునుండి తిరిగి వచ్చిన తర్వాత అతిధి డిల్లీలో చదువుకుంటున్న ఆ కోటేశ్వరుల కుమార్తె అమృతను ఒకసారి దుండగుల భారినుండి రక్షిస్తాడు. దాంతో అమృత అతన్ని ఇష్టపడి ప్రేమించమని అడుగుతుంది. అయితే అతిధికి తన వెంట పడుతున్న అమ్మాయి, తాను వెతుకుతున్న అమ్మాయి ఒక్కరే అని తెలియదు.తర్వాత అతిథికి తను వెతుకుతున్న అమృత ఈ అమ్మాయే అని తెలిసేటప్పడికి ఆ అమ్మాయి ఢిల్లినుండి హైదరాబాదుకు వచ్చేస్తుంది. ఆ అమ్మాయిని వెత్తుకుంటూ అతిధి కూడా హైదరాబాద్ కు వస్తాడు. అక్కడ అమృత వెనుక పెద్దకథ నడుస్తుందని తెలుసుకుంటాడు. తర్వాత కథ అనేక మలుపులు తిరుగుతుంది. ఇందులో అతిధిగా మహేష్ బాబు నటించాగా, అమృత పాత్రలో అమృతరావు నటించింది.

    నటీనటుల విషయానికి వస్తే మహేష్ బాబు చాలా మాన్లీగా కనిపించాడు. తనకు నచ్చిన ప్రాతకు పూర్తిస్థాయి న్యాయం చేశాడు. కాని హీరోయిన్ అమృతరావు మాత్రం మహేష్ బాబు పక్కన కుదరలేదు. ఆ అమ్మాయి విషయం లో ధర్శకుడు తప్పుచేశాడు.అమృతరావ్ తనకు ఇచ్చిన పాత్రను బాగా చేద్దమని ప్రయత్నించింది కాని మహేష్ బాబు లాంటి హీరో పక్కన ఆ పాత్ర తేలిపోయింది. ఆశిష్ విద్యార్థి డానీ పాత్రలో చాలా క్రూరంగా కనిపిస్తాడు. స్పెషల్ పోలీస్ అఫీసర్ గా చేసిన మురళీ శర్మ చాలా బాగా నటించాడు. ఇక కోటశ్రీనివాసరావు, నాజర్, సునిల్ , బ్రహ్మనందం , వేనుమాదవ్ లు మామూలే,

    టెక్నీషియన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలోని సీన్లను హాలివుడ్ తరహాలో చేయడానికి దర్శకుడు ప్రయత్నించాడు. ఇక సంగీతం విషయానికి వస్తే ఒక్క పాటకూడా అర్ధమయ్యే రీతిలో లేదు. అయితే భయానకంగా ఉండే సీన్లను మణిశర్మ, తన నేపథ్య సంగీతంతో ప్రాణం పోశాడు. ఫోటోగ్రఫి కూడా చాలా బాగా వచ్చింది. పైట్స్ కూడా హాలీవుడ్ తరహాలోనే ఉన్నాయి.

BACK

CLOSE    HOME

General News     Cinema News     International News     Sports News     Political News     Business News


Copyrights 2007. TIMES OF ANDHRA PUBLICATIONS. All rights reserved.